Entertainment

Vidrohi : ఆసక్తికరంగా ‘విద్రోహి’ ట్రైలర్

‎రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘విద్రోహి’. వి ఎస్‌ వి దర్శకత్వంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని వెంకట సుబ్రహ్మణ్యం విజ్జన నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని హీరో శ్రీకాంత్, ఫస్ట్ సాంగ్‌ని వివి వినాయక్ , 2nd సాంగ్ ఆర్ పి పట్నాయక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రం ట్రైలర్ ను తాజాగా కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఆవిష్కరించారు. త్వరలోనే విద్రోహి చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నారు.

‎‎ట్రైలర్ విడుదల అనంతరం అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ‘విద్రోహి’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమాలో పని చేసిన వారు నాకు చాలా క్లోజ్ పర్సన్స్. వారికి ఈ సినిమా మంచి సక్సెస్‌ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను విడుదల చేసిన ట్రైలర్ కూడా చాలా బాగుంది. దర్శక నిర్మాతలకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ ఈ సినిమా సక్సెస్‌ని ఇవ్వాలని కోరుకుంటున్నాని అన్నారు. రవిప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీకర్, సాయికి, తాగుబోతు రమేష్, మధునందన్, కోటేశ్వరరావు, జబర్దస్త్ బాబీ, రణ్వీర్ సాయి, ఆర్ కర్ణ, నవికేత్ పాటిల్, రాఘవేంద్ర పప్పుల, అన్వేష్. డిజె, మనమ్మ, దియా, మాధురి, సానియా, అనీష్ రామ్, ఆర్ జే నాయుడు, కృష్ణారావు, తడివేలు తదితరులు నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *