Entertainment

ఓజీలో తన పాత్రపై శ్రియా రెడ్డి కామెంట్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన OG రేపటి నుంచి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటిస్తుండగా, సలార్ ఫేమ్ శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలో కనిపించనుంది. తాజాగా ఫిల్మ్‌ఫేర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

“నా పాత్రలో భావోద్వేగాలు, శక్తి రెండు కలిసి ఉంటాయి. దానివల్ల వచ్చే ఇంపాక్ట్ చాలా భారీగా ఉంటుంది. ఈ రోల్‌కి ఉన్న లోతు దానిని మరింత రా ఇంటెన్స్‌గా మార్చాయి. నేను పూర్తిగా మేకప్ లేకుండా నటించాను. అది సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ ఆలోచన. ఆయన పాత్ర సహజంగా కనిపించాలని కోరుకున్నారు. నాకూ అదే విజన్ ఉండటంతో ఎంతో సంతోషంగా ఆ నిర్ణయాన్ని అంగీకరించాను” అని శ్రియా తెలిపారు.

పవన్ కళ్యాణ్‌తో పనిచేసిన అనుభవం గురించి మాట్లాడుతూ.. “ఆయన మాటలు తక్కువే మాట్లాడుతారు. నేనూ అలానే ఉంటాను. రాజకీయ పనులను పక్కనబెట్టి ఆయన షూటింగ్‌కి వస్తున్నారని నాకు తెలుసు. అందుకే ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు. అయితే సెట్‌లో సినిమాకి సంబంధం లేని ఎన్నో విషయాలు మేము చర్చించుకున్నాం” అని చెప్పుకొచ్చారు.

The post ఓజీలో తన పాత్రపై శ్రియా రెడ్డి కామెంట్స్..! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *