Entertainment

పూరి, సేతుపతి ప్రాజెక్ట్ టైటిల్, టీజర్ కి డేట్ వచ్చేసింది!

ప్రస్తుతం మన టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పలు ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లలో దర్శకుడు పూరి జగన్నాథ్ అలాగే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్ లో చేస్తున్న ప్రాజెక్ట్ కూడా ఒకటి. మరి షూటింగ్ శరవేగంగా పూర్తి అవుతున్న ఈ సినిమా కోసం చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఏంటి నేపథ్యం ఏంటి అనేవి ఇంకా గోప్యంగానే ఉన్నాయి.

అయితే ఇక దీనికి ఫైనల్ గా ఒక క్లారిటీ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు. ఈ సినిమా తాలూకా టైటిల్ టీజర్ ఇంకా ఫస్ట్ లుక్ లని ఈ సెప్టెంబర్ 28న లాంచ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఇపుడు అనౌన్స్ చేసి సాలిడ్ అప్డేట్ అందించారు. ఇక దీనితో అంతా ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా టబు కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే ఈ ఛార్మి, పూరిలు నిర్మాణం వహిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Puri Connects (@puriconnects)

The post పూరి, సేతుపతి ప్రాజెక్ట్ టైటిల్, టీజర్ కి డేట్ వచ్చేసింది! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *