Entertainment

ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “మదరాసి”

తమిళ స్టార్ నటుడు శివ కార్తికేయన్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రమే “మదరాసి”. మంచి హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం తమిళ నాట పర్వాలేదు అనిపించే రేంజ్ లో రాణించింది. ఇక తెలుగులో ఓ మోస్తరుగా ఓకే అనిపిస్తే ఇపుడు థియేటర్స్ నుంచి నెక్స్ట్ స్టాప్ గా ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యింది.

ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అందులో ఈ అక్టోబర్ 1 నుంచే వచ్చేస్తున్నట్టుగా ఇపుడు అధికారికంగా కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా తమిళ్ తో పాటుగా తెలుగు, హిందీ సహా ఇతర ముఖ్య పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి రానుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా శ్రీ లక్ష్మి సినిమాస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

The post ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న “మదరాసి” first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *