Entertainment

‘ది ప్యారడైస్’ నుంచి సాలిడ్ ట్రీట్.. ఎప్పుడంటే..?

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ది ప్యారడైస్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై హైప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి.

అయితే, ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ సర్‌ప్రైజ్ ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. సెప్టెంబర్ 27న ఉదయం 10.08 గంటలకు మరియు సాయంత్రం 5.04 గంటలకు ఈ అప్డేట్ ఉండబోతుందని మేకర్స్ తాజాగా వెల్లడించారు. అయితే, ఇది ఈ సినిమాలో విలన్‌గా నటించబోయేది ఎవరనే అప్డేట్ అయ్యి ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో నాని సరికొత్త గెటప్‌తో కనిపిస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

The post ‘ది ప్యారడైస్’ నుంచి సాలిడ్ ట్రీట్.. ఎప్పుడంటే..? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *