పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ఓజీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాను సుజీత్ డైరెక్ట్ చేయగా పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా సాలిడ్ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ విధ్వంసాన్ని మొదలుపెట్టింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం ప్రీమియర్ షోలతోనే $3 మిలియన్ వసూలు చేసి సత్తా చాటింది. రెండు రోజుల్లో $4.4 మిలియన్లను రాబట్టి, వీకెండ్ నాటికి $5 మిలియన్ క్లబ్‌లో చేరనుంది.
పవన్ కెరీర్‌లో ఈ రికార్డు తొలిసారి కాబోతుంది. డివివి దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించిన ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. థమన్ సంగీతం అందించగా, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
The post అక్కడ వీకెండ్ ముగిసేసరికి ఓజీ మైల్‌స్టోన్ ఖాయం..! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.