Entertainment

దసరా ట్రీట్ రెడీ చేస్తున్న ‘రాజాసాబ్’.. ట్రైలర్ ఆరోజే వస్తుందా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ది రాజాసాబ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రం ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ రిలీజ్ అవగా, దానికి ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది.

కాగా, ఈ చిత్ర ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ట్రైలర్‌ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ ట్రైలర్‌ను సర్‌ప్రైజింగ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 28న ఈ ట్రైలర్ వచ్చే అవకాశం ఉందని.. అయితే, అది కేవలం థియేటర్లలో మాత్రమే ప్లే చేస్తారనే టాక్ జోరుగా వినిపిస్తోంది.

మరొక వార్తలో ఈ ట్రైలర్‌ను దసరా పండుగా ట్రీట్‌గా అక్టోబర్ 1న రిలీజ్ చేయబోతున్నట్లు వినిపిస్తోంది. మరి నిజంగానే రాజాసాబ్ ట్రైలర్‌ను దసరా కానుకగా రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, సంజయ్ దత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

The post దసరా ట్రీట్ రెడీ చేస్తున్న ‘రాజాసాబ్’.. ట్రైలర్ ఆరోజే వస్తుందా..? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *