పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది రాజాసాబ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రం ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో, మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు అభిమానుల దృష్టి మొత్తం ట్రైలర్ మీదే. ఈ ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందా అనే ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తుంది. ఫిలిం సర్కిల్స్ టాక్ ప్రకారం, ట్రైలర్‌ను సర్‌ప్రైజ్‌గా..
Also Read : Vijay : విజయ్ ర్యాలీలో తొక్కిసలాట .. మండిపడిన శరత్‌కుమార్
సెప్టెంబర్ 28న విడుదల చేసే అవకాశముందని వినిపిస్తోంది. అయితే, ఆ రోజున ట్రైలర్‌ను కేవలం థియేటర్స్‌లో మాత్రమే ప్లే చేస్తారనేది మరో హాట్ న్యూస్. ఇక మరోవైపు, దసరా కానుకగా ట్రైలర్‌ను అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నిజంగా ఈ స్పెషల్ ఫెస్టివల్ ట్రీట్ రాబోతుందా అనే ఉత్కంఠ అభిమానుల్లో పెరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే సీనియర్ నటుడు సంజయ్ దత్ కూడా ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నారు. మ్యూజిక్ సెక్షన్‌లో థమన్ ఇప్పటికే అంచనాలు పెంచేశాడు. ‘ది రాజాసాబ్’ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ దసరాకు ప్రభాస్ అభిమానులకు నిజంగానే గ్రాండ్ ట్రీట్ దక్కనుందా అన్నది ఇప్పుడు చూడాలి.