Entertainment

“రాజా సాబ్” ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్ !

కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ది రాజా సాబ్ ట్రైలర్‌ను సెప్టెంబర్ 29, 2025న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ క్రమంలో ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ప్రభాస్ తో పాటు, ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ మరియు రిద్ధి కుమార్ కథానాయికలు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా జనవరి 9, 2026న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడట. అన్నట్టు ప్రభాస్ కి పూర్తిగా ఇది కొత్త జోనర్ అవుతుంది. కాగా ప్రభాస్ తో మారుతి సినిమా చేస్తే.. ఇక మారుతి రేంజ్ మారిపోయినట్టే.

The post “రాజా సాబ్” ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్ ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *