Entertainment

మెగా ఆల్బమ్‌ను వదులుతున్న బాస్.. ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేస్తోంది..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్రం నుంచి మెగా అప్డేట్స్ రానున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే, ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార ఫస్ట్ లుక్‌ను రివీల్ చేసిన మేకర్స్ తాజాగా మరో అప్డేట్ కూడా ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆల్బమ్‌ను త్వరిలో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపిన చిత్ర యూనిట్, ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రోమోను రేపు (అక్టోబర్ 2న) రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సాంగ్‌లో మెగా క్లాస్, మెగా స్వాగ్, మెగా విక్టరీ అభిమానులను అలరించేందుకు రెడీగా ఉందని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్నారు.

The publish మెగా ఆల్బమ్‌ను వదులుతున్న బాస్.. ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేస్తోంది..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *