Entertainment

ఇంట్రెస్టింగ్.. గ్లింప్స్ తో రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇపుడు ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఆమె నుంచి ఈ అక్టోబర్ లోనే ఓ బాలీవుడ్ సినిమా వస్తుండగా దీని తర్వాత కొంత గ్యాప్ లోనే మళ్ళీ మరో సినిమా వచ్చేందుకు సిద్ధం అయ్యింది. నటుడు అలాగే దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఆ చిత్రమే “ది గర్ల్ ఫ్రెండ్”.

రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో యంగ్ నటుడు దీక్షిత్ శెట్టి జంటగా నటించిన ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ఇపుడు ఓ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ తో అయితే అనౌన్స్ చేశారు. మరి ఈ గ్లింప్స్ తో రాహుల్ రవీంద్రన్ ఒక ఇంట్రెస్టింగ్ అటెంప్ట్ ని రష్మికతో చేసినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా లీడ్ జంట మధ్య సన్నివేశాలు, మరింత ఆసక్తిగా కనిపిస్తున్నాయి.

ఇక ఈ టీజర్ లో మూడ్ కి తగ్గట్టుగా హీశం అబ్దుల్ వాహబ్ ఇచ్చిన స్కోర్ కూడా సాలిడ్ గా ఉంది. అన్నట్టు ఈ సినిమాని మేకర్స్ ఈ నవంబర్ 7న థియేటర్స్ లో పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రం అల్లు అరవింద్ సమర్పణలో రిలీజ్ కి రాబోతుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

The publish ఇంట్రెస్టింగ్.. గ్లింప్స్ తో రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *