Entertainment

Alia Bhatt : డెలివరీ తర్వాత బరువు తగ్గడానికి అసలు కారణం షేర్ చేసిన అలియా భట్ ..

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి పరిచయం అవసరం లేదు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన సోంత టాలెంట్ తో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకుంది. తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చి ‘ఆర్ ఆర్ ఆర్’ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత నుంచి అలియా నటిస్తున్న ప్రతి ఒక్క మూవీ తెలుగులో కూడా విడుదలవుతూ మంచి విజయాన్ని అందుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఆలియా భట్ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.

Additionally Learn : Rashi Khanna : “ఆయన పేరు లాగే ఆయన స్వభావం కూడా పవర్‌ఫుల్” – రాశి ఖన్నా

ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు, రాహా అనే ఒక కుమార్తె జన్మించిన విషయం తెలిసిందే. నిత్యం తన కుమార్తెకు సంబంధించిన అన్ని విషయాలను ఆలియా దంపతులు అభిమానులతో పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా అలియా భట్ ఇటీవల తన వ్యక్తిగత జీవితం, డెలివరీ తర్వాత అనుభవాల గురించి ఓ టాక్ షోలో ఫ్యాన్స్‌తో పంచుకుంది. ‘కూతురు జన్మించిన తర్వాత మా లైఫ్ స్టైల్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు అలవాటు లేని పనులు కూడా చేయాల్సి వస్తున్నాయి, కానీ ఇది రాహా కోసం. నేను ఎంత తిన్నా సరే సహజంగా బరువు తగ్గాను. కానీ నా ఫోటోలు బయటకు వచ్చినప్పుడు ట్రోల్స్ చేయటం ప్రారంభించారు. ఎందుకు అంత త్వరగా బరువు తగ్గాల్సి వచ్చింది అని ప్రశ్నించారు. నిజానికి నేను ఎలాంటి ప్రయేగాలే చేయలేదు నా వంటి తీరు అలాంటిది. మునుపు నేను 9-10 గంటలు నిద్రపోతే, ఇప్పుడు గంటను లెక్కేసుకుని పడుకోవాల్సి వస్తుంది.ఇది నా కూతురు కోసం కాబట్టి సంతోషంగా అనిపిస్తుంది’ అని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *