హరిప్రసాద్ కోనే, ఇషాని గోష్ హీరో హీరోయిన్లుగా చైతన్య కొండా దర్శకత్వంలో గంగాధర్ పెద్ద కొండ నిర్మించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘ హ్యాపీ జర్నీ’. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ కోసం కార్యక్రమాలు జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రంలోని “వందేమాతరం” సాంగ్ ని చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గంగాధర్ పెద్ద కొండ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని తెలుగు హిందీ భాషల్లో నిర్మిస్తున్నాము. దేశభక్తి నేపథ్యంలో సాగే వెరైటీ కథ ఇది. ఈ చిత్రంలోని వందేమాతరం పాటను ప్రేక్షకుల ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉంది. ఓ మంచి చిత్రoతో ప్రేక్షకులు ముందుకు రానున్నాం. తెలుగు ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము. అని అన్నారు. హ్యాపీ జర్నీ సినిమా అక్టోబర్ నెలాఖరున విడుదల కానుంది.
The put up ఈ నెలాఖరున విడుదల కానున్న హ్యాపీ జర్నీ ! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.