Entertainment

బరిలోకి దిగుతున్న ‘ఛాంపియన్’.. డేట్ ఫిక్స్..!

టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఛాంపియన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్ ఈ మూవీపై అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ సి.అశ్వనీదత్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పీరియాడిక్ స్పోర్ట్స్ చిత్రంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఛాంపియన్ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా 2025 డిసెంబర్ 25న వరల్డ్‌వైడ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఈ సినిమాలో అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తోండగా మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని స్వప్న సినిమా, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

The publish బరిలోకి దిగుతున్న ‘ఛాంపియన్’.. డేట్ ఫిక్స్..! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *