సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ మెజారిటీ శాతం ఆఫ్రికా అడవుల్లో చిత్రీకరించనున్నారు. ఇక ఈ సినిమాతో మహేష్ బాబును ఇప్పటివరకు చూపెట్టని విధంగా రాజమౌళి మనకు చూపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈ సినిమాలో మహేష్‌లోని డ్యాన్సర్‌ను బయటకు తీసుకొచ్చేందుకు రాజమౌళి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ ఫోక్ సాంగ్ ఉండనుందని.. దీనికి కీరవాణి అదిరిపోయే ట్యూన్స్ ఇవ్వనుండగా రాజు సుందరం కొరియోగ్రఫీ చేయనున్నాడట. ఇక ఈ పాటలో హీరోయిన్ ప్రియాంక చోప్రాతో మహేష్ సరికొత్త స్టెప్స్‌తో డ్యాన్స్ చేయనున్నట్లు చిత్ర వర్గాల టాక్.
ఈ పాటలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా డ్యాన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్‌ను నవంబర్‌లో వెల్లడించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
The put up మహేష్ బాబుతో ఈసారి అలా ప్లాన్ చేస్తున్న జక్కన్న..? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.