
Ram Gopal Varma: ఏంటి బోనీ కపూర్ వల్ల శ్రీదేవి బతికున్న సమయంలో అన్ని కష్టాలు అనుభవించిందా.. శ్రీదేవిని అంత టార్చర్ చేశాడా.. రాంగోపాల్ వర్మ చెప్పిన మాటల్లో ఉన్న నిజమెంతా అనేది ఇప్పుడు చూద్దాం.రాంగోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రతిసారి ఏదో ఒక దుమారం సృష్టించే మాటలు మాట్లాడుతూనే ఉంటారు. అయితే అలాంటి రాంగోపాల్ వర్మ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీదేవి గురించి బోనీకపూర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Ram Gopal Varma shocking comments on Sridevi death
రాంగోపాల్ వర్మ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శ్రీదేవి చనిపోయే ముందు అలా అవ్వడానికి కారణం బోనీ కపురే.. బోనీకపూర్ శ్రీదేవికి చాలా విషయాల్లో కండిషన్స్ పెట్టాడు.శ్రీదేవి ఏ పాత్ర చేయాలన్నా ఎవరితో నటించాలి అన్నా అన్ని బోనీ కపూర్ కి చెప్పే చేయాలి. బోనీ కపూర్ వద్దంటే అందులో నటించేది కాదు..(Ram Gopal Varma)
Also Read: Manchu Lakshmi: మనోజ్ విష్ణు గొడవలు.. సర్వనాశనం అవుతారు అంటూ మంచు లక్ష్మి శాపనార్థాలు..!
ఇక రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన బాహుబలి సినిమా సమయంలో కూడా బోనీకపూర్ శ్రీదేవి పాత్ర కోసం ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడు. కానీ ఈ విషయం శ్రీదేవికి తెలియదు. అలా తన భార్యకు తెలియకుండా చాలానే చేశాడు.అయితే ఈ విషయాలన్నీ శ్రీదేవి నా దగ్గర స్వయంగా చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది..

అంతేకాదు శ్రీదేవి ఒకటి రెండు కోట్ల కోసం దిగజారి నటించింది అది బోనీ కపూర్ వల్లే.. ఎన్నో పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్స్ వదులుకుంది.. అలా ఒకరకంగా శ్రీదేవి కెరియర్ డౌన్ అయింది అంటే అది కేవలం బోనీకపూర్ వల్లే.. అంటూ సంచలన విషయాలు బయట పెట్టారు రాంగోపాల్ వర్మ. మరి రాంగోపాల్ వర్మ శ్రీదేవి గురించి చెప్పినవన్నీ నిజాలేనా అనేది తెలియాల్సి ఉంది.(Ram Gopal Varma)