
Devi Sri Prasad: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ 40 ఏళ్ళు దాటినా కూడా ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు.అయితే ఈయనకు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదో లేక ఆయన మనసుకు నచ్చిన అమ్మాయి దొరకడం లేదో తెలియదు కానీ ఇప్పటివరకైతే పెళ్లికి దూరంగానే ఉంటున్నారు.అయితే తాజాగా ఆయన పాల్గొన్న జయమ్ము నిశ్చయమ్మురా షో లో కూడా పెళ్లి గురించి ఎవరు ఊహించని కామెంట్స్ చేశారు.ఈ టాక్ షోలో జగపతిబాబు ముందు పెళ్లి చేసుకుంటారా లేక హీరో అవుతారా అని ప్రశ్నించగా..
Devi Sri Prasad unexpected comments on marriage
అందరూ నిరాశ పడే అన్సర్ ఇచ్చారు దేవిశ్రీప్రసాద్.పెళ్లి పక్కన ఎలాంటి ఆప్షన్ పెట్టినా కూడా నేను మొదట ఆ ఆప్షన్ నే ఎంచుకుంటాను. అలా పెళ్లి కాదు మొదట హీరో అవుతాను అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. అయితే దేవిశ్రీప్రసాద్ ఆన్సర్ ని బట్టి చూస్తే ఆయనకి అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని,ఈ జీవితంలో ఆయన పెళ్లి చేసుకునేలా కనబడడం లేదని చాలామంది మాట్లాడుకుంటున్నారు.(Devi Sri Prasad)
Also Read: Anushka: నాగార్జున సినిమా మిగిల్చిన గాయం.. ఏడాది పాటు ఇంట్లో కన్నీళ్లు పెట్టుకున్న అనుష్క.!
ఏది ఏమైనప్పటికీ పెళ్లి గురించి ఇలాంటి ఆన్సర్ ఇచ్చి దేవిశ్రీప్రసాద్ తన అభిమానులని ఘోరంగా హర్ట్ చేశారు అని అంటున్నారు సోషల్ మీడియా నెటిజన్లు. అంతేకాదు దేవిశ్రీప్రసాద్ మాట్లాడిన వీడియోకి కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇక దేవిశ్రీప్రసాద్ ఈ మధ్యనే హీరో అవుతున్నట్టు ఒక వార్త వినిపించింది. బలగం సినిమాతో డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకొని స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్లమ్మ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో ఎంతోమంది హీరోల పేర్లు తెరమీదకి వస్తున్నాయి సడన్గా ఆ హీరోలు అందులో నుండి తప్పుకుంటున్నారు. ఇక ఫైనల్ గా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఎల్లమ్మ మూవీలో హీరోగా చేస్తున్నట్టు రీసెంట్గా వార్తలు వినిపించాయి. ఇక ఈ వార్తలను నిజం చేసేలా తాజాగా జయమ్ము నిశ్చయమ్మురా షోలో దేవి శ్రీ ప్రసాద్ ముందు హీరో అవుతానని మాట్లాడిన మాటలు మరింత బలం చేకూరుస్తున్నాయి.(Devi Sri Prasad)