Entertainment

Panjaram : వెన్నులో వణుకు పుట్టించేలా పంజరం ట్రైలర్

సే స్టోరీ ప్రొడక్షన్స్, ఆర్3 ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఆర్ రఘన్ రెడ్డి నిర్మాతగా సాయి కృష్ణ దర్శకత్వంలో అనిల్, యువతేజ, ముస్కాన్, రూప ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘పంజరం’. కొత్త వాళ్లంతా కలిసి చేసిన ఈ హారర్ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను బుధవారం నాడు రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ మాత్రం వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. పేదరాసి పెద్దమ్మ అంటూ ఓపెన్ చేసిన ట్రైలర్, ఊరుని చూపించిన తీరు, హారర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి.

Additionally Learn : Sobhita : కత్తిలాంటి అందాలను ఆరబోస్తున్న శోభిత..

హారర్ మూవీకి ఉండాల్సిన కెమెరా వర్క్, ఆర్ఆర్ ‘పంజరం’లో కనిపించాయి. ట్రైలర్‌లో చివరి షాట్ మాత్రం అందరినీ భయపెట్టించేలానే ఉంది. ఈ ట్రైలర్ లాంఛ్ చేసిన అనంతరం ఈ కార్యక్రమంలో దర్శకుడు సాయికృష్ణ మాట్లాడుతూ .. ‘ప్రదీప్ ఈ చిత్రంలో మంచి పాత్రను పోషించారు. పద్మ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. రమణ, సురేష్, ఇలా అందరూ బాగా నటించారు. నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన అనిల్, యువతేజ, ముస్కాన్, రూపలకు థాంక్స్. మా ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా సినిమాకు ఆడియెన్స్, మీడియా సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నాను’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *