Entertainment

‘బైసన్’ మూవీ ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్.. ధృవ్ విక్రమ్ ఈసారి హిట్ కొట్టేలా ఉన్నాడుగా..!

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బైసన్’. మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను దీపావళి కానుకగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఈ సందర్భంగా ఈ మూవీ నుండి ‘తీరేనా తీరేనా’ అనే ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు తమిళ లిరిక్స్ మారి సెల్వరాజ్ అందించగా తెలుగు లిరిక్స్ ఎనమంద్రా రామకృష్ణ అందించారు. నివేస్ కే ప్రసన్న ఈ పాటను అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ పాటలో ధృవ్ విక్రమ్ ఇంటెన్స్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ సినిమాను నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో ప్రముఖ దర్శకుడు పా రంజిత్ సమర్పణలో వస్తుండగా తెలుగులో జగదాంబే ఫిలిమ్స్ పై నిర్మాత బాలాజీ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 24న రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా జగదాంబే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ బాలాజీ మాట్లాడుతూ..”ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ధృవ్ తనదైన పర్ఫామెన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నాం.” అని అన్నారు.

ఈ సినిమాలో పశుపతి, కలైయరసన్, రెజిషా విజయన్, హరికృష్ణన్‌, అళగమ్‌ పెరుమాళ్‌, అరువి మదన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా రంజిత్, అదితి ఆనంద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

The submit ‘బైసన్’ మూవీ ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్.. ధృవ్ విక్రమ్ ఈసారి హిట్ కొట్టేలా ఉన్నాడుగా..! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *