యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ
సినిమాను దర్శకుడు పి.మహేశ్ బాబు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ
నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలు పెంచింది.
ఇక ఈ సినిమా నుంచి ఇప్పుడు టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ చిత్ర టీజర్‌ను అక్టోబర్ 12న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్
తాజాగా వెల్లడించారు. ఈ టీజర్ ప్రేక్షకులను, అభిమానులను అమితంగా ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఈ సినిమాలో రామ్ పోతినేని తో పాటు కన్నడ స్టార్ ఉపేంద్ర, అందాల భామ భాగ్యశ్రీ బొర్సె తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ ద్వయం వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా నవంబర్ 28న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
The publish ఆంధ్ర కింగ్ తాలూకా.. టీజర్ వచ్చేస్తోంది..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.