Entertainment

‘మీసాల పిల్ల’.. ముహూర్తం ఫిక్స్ చేసిన శంకర వర ప్రసాద్ గారు..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో చిరంజీవి బాక్సాఫీస్ దగ్గర మంచి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని మేకర్స్ ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాలోని ‘మీసాల పిల్ల’ పాట ప్రోమో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

అనిల్ రావిపూడి ప్రమోషన్లతో జోష్ ప్రారంభించగా, ఈ మెలోడి ప్రోమోకు ఇప్పటికే విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సాంగ్‌ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సాంగ్‌ను అక్టోబర్ 13న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఈ విషయాన్ని అనిల్ రావిపూడి, ‘సంక్రాంతికి వస్తున్నాం’లోని బుల్లి రాజుతో కలిసి సరదాగా ప్రకటించారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాట ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

The submit ‘మీసాల పిల్ల’.. ముహూర్తం ఫిక్స్ చేసిన శంకర వర ప్రసాద్ గారు..! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *