Entertainment

ఓటిటి క్లాష్ లో ‘కూలీ’పై ‘వార్ 2’దే పైచేయి?

ఈ ఏడాది ఇండియన్ సినిమా దగ్గర చూసిన సాలిడ్ క్లాష్ చిత్రాలలో ఈ ఆగష్టు 15 కానుకగా రిలీజ్ కి వచ్చిన చిత్రాలు సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జునల కూలీ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ ల కలయికలో వచ్చిన చిత్రం “వార్ 2” ల క్లాష్ అని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాలు విడుదల దగ్గరకి వస్తున్న సమయంలో మరింత ఆసక్తి నెలకొనగా రెండు చిత్రాలకి కూడా మరీ బ్లాక్ బస్టర్ రేంజ్ టాక్ కూడా పడలేదు. అయినప్పటికీ కూలీ వసూళ్ల పరంగా డామినేట్ చేసింది. కానీ ఈ రెండు సినిమాలు ఇటీవల ఓటిటిలో వచ్చాయి.

కూలీ ప్రైమ్ వీడియోలో వస్తే వార్ 2 మాత్రం నెట్ ఫ్లిక్స్ లో వచ్చింది. కానీ ఇంట్రెస్టింగ్ గా ఈసారి మాత్రం వార్ 2 ధై పైచేయి అయినట్టు తెలుస్తుంది. కూలీ కంటే వార్ 2 కే ఓటిటిలో అత్యధిక రెస్పాన్స్ వచ్చినట్టుగా ఇప్పుడు టాక్. అయితే కూలీ మొదట్లో హిందీ వెర్షన్ రాలేదు కానీ వార్ 2 మాత్రం హిందీ కలిపే వచ్చింది. దీనితో ఈ వ్యత్యాసం ఉండి ఉండొచ్చు కానీ అల్టిమేట్ గా మాత్రం ఓటిటిలోకి వచ్చిన ఎర్లీ రోజుల్లో వార్ 2 రెస్పాన్స్ నే ఎక్కువ ఉన్నట్టుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది.

The submit ఓటిటి క్లాష్ లో ‘కూలీ’పై ‘వార్ 2’దే పైచేయి? first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *