అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తున్న చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ చిత్రానికి రమణ రెడ్డి సోమ దర్శకత్వం వహిస్తుండగా, మాధవి రెడ్డి సోమ నిర్మిస్తున్నారు.
యూత్ ఫుల్ కామెడీతో కూడిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో శ్రీ విష్ణు విడుదల చేశారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా హైదరాబాద్ నేపథ్యంలో ముగ్గురు స్నేహితుల కథగా సాగనుంది.
పోస్టర్‌ను చూసిన శ్రీ విష్ణు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి స్మరన్ సాయి సంగీతం అందిస్తుండగా, ఎస్‌వికె సినిమాటోగ్రఫీని, రోహిత్ పెనుమత్స ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.
The put up శ్రీ విష్ణు చేతుల మీదుగా ‘అమీర్ లోగ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.