Entertainment

ట్రైలర్ టాక్ : అసాధారణ ప్రేమకథతో ఆకట్టుకున్న ‘తెలుసు కదా’ !

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘తెలుసు కదా’. అక్టోబర్ 17, 2025న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ లో యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకున్నారు. ట్రైలర్ ను చూస్తుంటే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా సినిమా సాగుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా హీరో – ఇద్దరి హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ బాగుంది. ఆదేవిధంగా ట్రైలర్‌లో కొన్ని డైలాగ్‌లు కూడా ఆకట్టుకున్నాయి.

ప్రధానంగా సినిమా మెయిన్ థీమ్ తో పాటు సిద్దు పాత్ర కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. దీనికి తోడు తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. మరి ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

The publish ట్రైలర్ టాక్ : అసాధారణ ప్రేమకథతో ఆకట్టుకున్న ‘తెలుసు కదా’ ! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *