Entertainment

మీసాల పిల్లా.. మెగా ఫ్యాన్స్ ఇంకాస్త ఆగాల్సిందే..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌పై ఇప్పటికే మేకర్స్ ఓ బిగ్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

‘మీసాల పిల్లా’ అంటూ సాగే ఈ పాటను నేడు(అక్టోబర్ 13) రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, చివరి నిమిషంలో ఈ పాట రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనికి గల కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది. ఫస్ట్ సింగిల్ సాంగ్‌తోనే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేయాలని మేకర్స్ భావించారు.

ఇక ఈ పాటను ఒకరోజు ఆలస్యంగా అక్టోబర్ 14న రిలీజ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. అయితే, ఈ పాటను ఏ సమయంలో రిలీజ్ చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో సాహు గరపాటి మరియు సుష్మిత కొణిదెల నిర్మాతలుగా రూపొందించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. MSG సంక్రాంతి 2026 లో థియేటర్లలో విడుదల కానుంది.

The publish మీసాల పిల్లా.. మెగా ఫ్యాన్స్ ఇంకాస్త ఆగాల్సిందే..! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *