టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మిత్ర మండలి’ దీపావళి కానుకగా అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేయడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా నిర్మాత బన్నీ వాస్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాపై నెగిటివ్ ట్రోలింగ్ చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని.. పెయిట్ ట్రోలర్స్‌తో ఈ సినిమాపై దుష్ప్రచారం చేయిస్తున్నారని.. వారు ఏం చేసినా సినిమాలో కంటెంట్ ఉంటే ఎవరూ ఆపలేరని ఆయన తెలిపారు.
దీంతో ఈ సినిమాపై పెయిడ్ ట్రోలింగ్ చేయిస్తుంది ఎవరా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ బెహరా లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
The submit ‘మిత్ర మండలి’ పై పెయిడ్ ట్రోలింగ్.. బన్నీ వాస్ మాస్ వార్నింగ్! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.