యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా ‘డ్రాగన్’. ఈ మూవీ పై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్‌బస్టర్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నా ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ తో వస్తుండటంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో క్రేజీ ఎక్సైట్‌మెంట్ పెరిగిపోయింది. ఇటీవల ఎన్టీఆర్ లూక్ కూడా అందరిని షాక్ కి గురిచేసింది, లీన్ బాడీ, పుల్ గడ్డం స్టైల్ లో స్టన్నింగ్ లుక్స్‌లో దర్శనమిచ్చాడు. ఈ లుక్ చూసి అభిమానులు చాలా సర్‌ప్రైజ్ అయిపోయారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుంది.
Additionally Learn : Kiara Abbavaram : నా పై సింపతీ వద్దు.. కంటెంట్ నచ్చితేనే రండి..
అయితే ప్రజంట్ OTT లకు డిమాండ్ బాగా పెరిగినప్పటికీ, ‘డ్రాగన్’ టీం ఓటీటీ రీలీజ్ విషయంలో ప్రత్యేక అగ్రిమెంట్ చేసుకుంది. తాజాగా తెలిసిన వివరాల ప్రకారం, సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే OTT ప్లాట్‌ఫారమ్ లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుందట. దీనిపై టీం అగ్రిమెంట్ కూడా రాయించుకుందట. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మొత్తానికి, ‘డ్రాగన్’ కోసం అభిమానుల్లో క్రేజీ ఎక్సైట్‌మెంట్, ఎన్టీఆర్ లూక్ OTT రిలీజ్ ప్లాన్ కలిపి సినిమాపై హై అంచనాలు పెంచాయి.