Entertainment

మీసాల పిల్ల సాంగ్.. వింటేజ్ మెగాస్టార్‌ను చూస్తారా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా ఈ మూవీ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘మీసాల పిల్ల’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌ను లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ కలిసి పాడారు. గతంలోనూ చిరంజీవికి పలు బ్లాక్‌బస్టర్ సాంగ్స్‌ను ఉదిత్ నారాయణ్ పాడారు. దీంతో ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కావడటంతో ఈ పాటపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.

ప్రోమోతోనే ఈ పాట అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుంది. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన ఈ పాటలో చిరంజీవి వింటేజ్ స్టెప్స్‌తో ఇరగదీశాడు. అటు లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ పాటలో ఆకట్టుకుంది. ఈ పాటను భీమ్స్ సిసిరోలియో చక్కటి ట్యూన్స్‌తో కంపోజ్ చేయగా భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

The submit మీసాల పిల్ల సాంగ్.. వింటేజ్ మెగాస్టార్‌ను చూస్తారా..? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *