Entertainment

Rashi Khanna: పవర్ స్టార్ తర్వాత మెగాస్టారే?

రాశీ ఖన్నా థాంక్యూ తర్వాత టాలీవుడ్‪లో కనిపించలేదు. బాలీవుడ్, కోలీవుడ్ అంటూ తచ్చట్లాడుతోంది కానీ తెలుగు ప్రేక్షకులను పట్టించుకోవడం లేదు. నీరజా కోన దర్శకత్వంలో తెలుసు కదా కమిటయ్యందన్న మాటే కానీ ఎంత వరకు వచ్చిందో అప్డేట్ ఉండేది కాదు. ఫస్ట్ సింగిల్ వచ్చాక హమ్మయ్య సినిమా లైన్లోనే ఉందన్న కాన్ఫిడెన్స్ కలిగింది. మూడేళ్ల తర్వాత తెలుసు కదాతో మళ్లీ టాలీవుడ్ కెరీర్ బూస్టప్ అవుతుందని గట్టిగానే నమ్ముతోంది ఈ ఢిల్లీ డాళ్.

Additionally Learn :Akhanda 2: అఖండ క్రేజ్.. ఓటీటీ, శాటిలైట్ హక్కులతోనే 90% రికవరీ?

హిందీలో బిజీగా ఉన్న టైంలో ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్‌ ఆఫర్ వచ్చింది రాశీకి. పవర్ స్టార్ సినిమా అనగానే కథ వినకుండా ఎగిరి గంతులేసి సెట్‌లో వాలిపోయానని చెప్పుకుంటున్న రాశీ ఖన్నా.. ఆనందానికి అవథుల్లేవు. ఇప్పటి వరకు తారక్ మినహా టైర్ 1 హీరోలతో జోడీ కట్టిన దాఖలాలు లేవు అమ్మడు. అందులోనూ మెగా హీరోతో వర్క్ అంటే ఆమెకు కలిసొస్తూ ఉంటుంది. సుప్రీమ్, తొలి ప్రేమ, ప్రతి రోజు పండుగ చిత్రాలు కమర్షియల్ హిట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో సినిమా అంటే మరో మెట్టు ఎక్కినట్లే భావిస్తోంది మేడమ్. అయితే మరో లక్కీ ఛాన్స్ రాశీని వెతుక్కుంటూ వచ్చిందన్నది లెటేస్ట్ బజ్.

Additionally Learn :Off The Report: బాలయ్య పేరుతో టీడీపీలో కొత్త కుంపటి అంటుకుంటుందా?

వాల్తేరు వీరయ్య కాంబో మళ్లీ రిపీట్ కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవిని మరోసారి డీల్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టాడు బాబీ. కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీగా తెరకెక్కించబోతుంది. మన శంకర్ వర ప్రసాద్ గారూ కంప్లీట్ అయ్యాక చిరు ఈ ప్రాజెక్టుకు షిఫ్ట్ కాబోతున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లను పరిశీలిస్తున్నాడట బాబీ. అందులో బెల్లం శ్రీదేవి అలియాస్ రాశీ ఖన్నాతో పాటు మాళవిక మోహనన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే నిజమేతే.. మేడమ్ పంట పండినట్లే. రీసెంట్లీ ఓ ఈవెంట్లో పాట పాడినందుకు మన శంకర్ వర ప్రసాద్‌గారులో పాట పాడే ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఆ ఛాన్స్ లభిస్తే రాశీకి ఇది అనదర్ హ్యాపీనెస్. ఇక టాలీవుడ్‌లో బిజీ అయితే.. హిందీలో త్రీ, ఫోర్ ఫిల్మ్స్ చేస్తున్న రాశీ.. నార్త్ బెల్ట్‌ను వదిలేసి వచ్చేస్తుందేమో చూడాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *