వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా వెంకటేష్, త్రివిక్రమ్ కలిసి తీయించుకున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావు’ ‘మల్లీశ్వరి’ చిత్రాలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పనిచేశారు. దీంతో వీరిద్దరి తాజా చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ చిత్రంలో కథానాయికలుగా త్రిష, నిధి అగర్వాల్, రుక్మిణీ వసంత్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. అయితే ..
టాలీవుడ్ త్రివిక్రమ్ తన గత చిత్రాలకు తరచుగా థమన్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసేవారు. ఈ జోడీ ఎన్నో సూపర్‌హిట్‌లు ఇచ్చింది. అయితే, వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమాకు త్రివిక్రమ్ ఈసారి థమన్‌ను రీప్లేస్ చేసి హర్షవర్ధన్ రమేశ్వర్‌ను తీసుకున్నారు. దీనిని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో త్రివిక్రమ్-థమన్ మధ్య విభేదం ఉందని చర్చ జరుగుతోంది. కానీ వాస్తవం ఏంటంటే, థమన్ ప్రస్తుతం అనేక సినిమాలతో బిజీగా ఉన్నారు, అలాగే ఆయన రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ. ఈ కారణంగా, త్రివిక్రమ్ సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించి, పారితోషికం విషయంలో సౌకర్యంగా ఉండే సంగీత దర్శకుడిని తీసుకోవాలని నిర్ణయించగా, హర్షవర్ధన్ రమేశ్వర్ ఆయనకు సరైన ఎంపికగా నిలిచారు.