Entertainment

ఓటిటి డేట్ లాక్ చేసుకున్న విజయ్ ఆంటోనీ రీసెంట్ పొలిటికల్ థ్రిల్లర్

తెలుగు ఆడియెన్స్ లో మంచి ఆదరణ ఉన్న తమిళ హీరోస్ లో నటుడు అలాగే దర్శకుడు విజయ్ ఆంటోనీ కూడా ఒకరు. మరి తన నుంచి ఈ ఏడాదిలోనే రెండు థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. అలా లేటెస్ట్ గా వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ చిత్రమే ‘భద్రకాళి’. దర్శకుడు అరుణ్ ప్రభు తెరకెక్కించిన ఈ చిత్రానికి తెలుగు, తమిళ ఆడియెన్స్ నుంచి మంచి టాక్ దక్కింది.

అయితే థియేటర్స్ నుంచి రన్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలో అలరించేందుకు వచ్చేస్తుంది. ఈ సినిమా హక్కులు ఓటిటి సంస్థ జియో హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఈ అక్టోబర్ 24 నుంచి తెలుగు, తమిళ భాషలు సహా కన్నడ, మలయాళంలో కూడా వస్తుంది అని కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే సంగీతం, నిర్మాణం కూడా వహించారు.

The submit ఓటిటి డేట్ లాక్ చేసుకున్న విజయ్ ఆంటోనీ రీసెంట్ పొలిటికల్ థ్రిల్లర్ first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *