మంచు లక్ష్మి రీసెంట్ గా నటించిన చిత్రాల్లో ఒకటే “దక్ష”. మంచు లక్ష్మి సహా చిత్ర శుక్ల కూడా ప్రధాన పాత్రలో ఈ సినిమాలో నటించగా మంచు మోహన్ బాబు ఇంకా సముద్రఖని లాంటి వెర్సటైల్ నటులు నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు కానీ ఇపుడు ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.
మరి ఈ సినిమా ఓటిటి హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా అందులో ఈ అక్టోబర్ 17 నుంచి అందుబాటులోకి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో దక్ష చిత్రాన్ని అప్పుడు మిస్ అయ్యి చూడాలి అనుకునేవారు ఓటిటిలో ఆరోజు వరకు ఆగాలి. ఇక ఈ చిత్రానికి మంచు వారి చాలా సినిమాలకే సంగీతం అందించిన అచ్చు సంగీతం అందించగా మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి నిర్మాణం వహించారు.
The submit మంచు లక్ష్మి క్రైమ్ థ్రిల్లర్ ‘దక్ష’ ఓటిటి రిలీజ్ డేట్ లాక్! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.