ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతున్న చిత్రం ‘జటాధర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా నుంచి తాజాగా ‘ట్రెండ్ సెట్ చెయ్’ అనే సింగిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. నవ ధళపతి సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఫస్ట్ గ్లింప్స్ మరియు రెండు పాటలతోనే క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా ఈ కొత్త సాంగ్‌తో మరింత హైప్ సృష్టిస్తోంది.
రాయీజ్ & జైన్ – సామ్ సంగీతం అందించిన ఈ పాట ఎలక్ట్రానిక్ బీట్స్‌తో ఉత్సాహభరితంగా ఉంది. స్పూర్తి జితేందర్ మరియు రాజీవ్ రాజ్ గానం, శ్రీమణి యూత్‌ఫుల్ లిరిక్స్ కలిసి పాటకు ఎనర్జీని తీసుకొచ్చాయి. ఇది సినిమాలోని సింగిల్ హీరో వైబ్‌కి తగిన యాంతమ్‌లా అనిపిస్తోంది.
ఈ పాటలో సుధీర్ బాబు స్టైలిష్ డ్యాన్స్ స్టెప్స్‌తో ఆకట్టుకున్నారు. ఆయనతో పాటు శ్రేయ శర్మ గ్లామరస్ లుక్‌లో కనిపించారు. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో, జీ స్టూడియోస్ మరియు ప్రేరణ అరోరా (ఎస్‌కేజీ ఎంటర్టైన్మెంట్) నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
The submit ‘జటాధర’ నుండి ట్రెండ్ సెట్ చేస్తున్న పిల్లోడు..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.