Entertainment

‘పెద్ది’ నెక్స్ట్ అప్డేట్ ఇదే.. ఇరగ్గొట్టేశాడంటున్న బుచ్చిబాబు..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్రం ‘పెద్ది’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండగా రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది.

అయితే, ఈ సినిమా నుంచి రాబోతున్న నెక్స్ట్ అప్డేట్ ఏమై ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు తాజాగా ఓ క్లారిటీ ఇచ్చాడు. పెద్ది చిత్రం నుంచి నెక్స్ట్ రాబోతున్న అప్డేట్ ఓ లవ్ సాంగ్ అని.. దీనికోసం ఏఆర్ రెహమాన్ అత్యద్భుతమైన ట్యూన్స్‌తో ఇరగ్గొట్టేశాడని ఆయన అన్నారు. ఈ సాంగ్ కోసం తాను కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తుండగా అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా 2026 మార్చి 26న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు.

The submit ‘పెద్ది’ నెక్స్ట్ అప్డేట్ ఇదే.. ఇరగ్గొట్టేశాడంటున్న బుచ్చిబాబు..! first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *