Entertainment

‘తెలుసు కదా’లో తనపాత్ర పై సిద్ధు హైప్..!

స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ చిత్రం ‘తెలుసు కదా’ దీపావళి కానుకగా ఈ నెల 17న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు మేకర్స్.

ఈ ఈవెంట్‌లో సిద్ధు జొన్నలగడ్డ తాను చేసిన వరుణ్ పాత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందని.. సినిమాలో తన క్యారెక్టర్ ఒక్క చుక్క రక్తం చిందించకుండా ఎమోషనల్ వార్, సైకలాజికల్ వైలెన్స్‌ని సృష్టిస్తాడని.. ఇది తన ప్రామిస్ అంటూ చెప్పుకొచ్చాడు.

సిద్ధు చేసిన ఈ కామెంట్స్‌తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. నీరజా కోన డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

The publish ‘తెలుసు కదా’లో తనపాత్ర పై సిద్ధు హైప్..! first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *