Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఓజీ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో రాబోతున్నారు. అయితే పవన్ కల్యాణ్ బయట ఎంత పవర్ స్టార్ అయినా.. బయట చాలా మొహమాటంగానే కనిపిస్తుంటారు. ఇదే విషయాన్ని సమంత చెప్పింది. ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి చెప్పిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నేను పవన్ కల్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమాలో నటించాను. ఆ మూవీ కోసం మేం స్విట్జర్ ల్యాండ్ వెళ్లాం.
Learn Additionally : Chiranjeevi : ఆ విషయంలో చిరు గ్రేట్.. మనసున్న మెగాస్టార్..
అక్కడ ఓ సాంగ్ షూటింగ్ చేయడానికి పవన్ కల్యాణ్ గారు చాలా సిగ్గుపడ్డారు. అక్కడ జనాలు ఉన్నారు నేను చేయలేను అని కారవాన్ లోకి వచ్చి కూర్చున్నారు. వెంటనే త్రివిక్రమ్ వెళ్లి నువ్వు చేయగలవు, యూ కమ్ అంటూ చెప్పారు. నేను చేయలనంటారా అని పవన్ కల్యాణ్ అడగడం చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంత పెద్ద పవర్ స్టార్ అయినా కూడా అంత సింపుల్ గా ఎలా ఉంటున్నారు అనుకున్నాను. ఆయన బయటకు అలా కనిపిస్తారు గానీ.. పది మందిలో ఏదైనా చేయాల్సి వస్తే చాలా సిగ్గుపడుతారు అంటూ తెలిపింది సమంత. ఆమె చేసిన కామెంట్లు మరోసారి వైరల్ అవుతున్నాయి.
Learn Additionally : Anasuya : ఆ హీరో అంటే పిచ్చి.. ఛాన్స్ వస్తే పెళ్లి చేసుకునేదాన్ని