Entertainment

ఎస్‌టీఆర్ కోసం ఎన్‌టీఆర్.. కారణం అదేనా..?

తమిళ దర్శకుడు వెట్రిమారన్ డైరెక్షన్‌లో స్టార్ హీరో శింబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అరసన్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచాలు క్రియేట్ చేశాయి. అయితే, ఈ సినిమాను తెలుగులో ‘సామ్రాజ్యం’ అనే టైటిల్‌తో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమా కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తనవంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చాడు.

ఈ సినిమా ప్రోమోలో ఎన్టీఆర్ వాయిస్‌ఓవర్ ఉంటుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో అసలు ఎన్టీఆర్ ఈ తమిళ సినిమా కోసం తన వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాడా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. అయితే, శింబుతో ఎన్టీఆర్‌కు మంచి బాండింగ్ ఉంది. అటు దర్శకుడు వెట్రి మారన్‌తో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తాడనే టాక్ కొంతకాలంగా వినిపిస్తూ వస్తుంది.

ఈ రెండు కారణాల్లో ఏదో ఒకదాని కోసం ఎన్టీఆర్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని కోలీవుడ్ మీడియా చెబుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. అక్టోబర్ 17న తెలుగు ప్రోమోను రిలీజ్ చేస్తున్నారు.

The publish ఎస్‌టీఆర్ కోసం ఎన్‌టీఆర్.. కారణం అదేనా..? first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *