మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస పరాజయాలు ఆయన కెరీర్‌పై ప్రభావం చూపాయి. కొన్ని సినిమాలు వాయిదా పడగా ఆయన ప్రస్తుతం “కొరియన్ కనకరాజు” చిత్రంపై దృష్టి పెట్టాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అధిక శాతం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్ర షూటింగ్ నవంబర్ చివరినాటికి ముగించనున్నారు.
తాజాగా వరుణ్ తేజ్, విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపొందనున్న ఓ లవ్ స్టోరీకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గతేడాదే ఫైనల్ అయినప్పటికీ, అనేక కారణాల వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు వరుణ్ డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు డేట్స్ కేటాయించగా, వచ్చే ఏడాది అమెరికాలో కీలక షెడ్యూల్ జరగనుంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఆయనకు తిరిగి మంచి బూస్ట్ ఇవ్వగలదని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
The publish మరో కొత్త ప్రాజెక్ట్‌కు వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్..? first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.