Entertainment

RC17 షూటింగ్ పై నిర్మాతల క్లారిటీ.. మొదలయ్యేది అప్పుడే..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ అనే రూరల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ మాస్ లుక్స్‌తో ప్రేక్షకులను స్టన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన నెక్స్ట్ చిత్రాన్ని క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్షన్‌లో చేయనున్నాడు.

అయితే, సుకుమార్‌తో రామ్ చరణ్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. వారందరికీ ఓ సాలిడ్ న్యూస్ చెప్పారు నిర్మాతలు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ నవీన్ యేర్నేని తాజాగా డ్యూడ్ సక్సెస్ మీట్‌లో ఈ విషయంపై మాట్లాడారు. సుకుమార్ తన నెక్స్ట్ చిత్రంగా ‘పుష్ప-3’ని కాకుండా.. రామ్ చరణ్‌తో RC17 ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కిస్తారని.. ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్ లేదా మే నెలలో ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.

దీంతో రామ్ చరణ్-సుకుమార్ కాంబోలో రాబోతున్న ఈ ప్రెస్టీజియస్ చిత్రం ఎలాంటి కథతో వస్తుందా.. ఈ సినిమాలో ఎలాంటి క్యాస్టింగ్ నటిస్తారా.. అనే ఆసక్తి అప్పుడే అభిమానుల్లో నెలకొంది.

The publish RC17 షూటింగ్ పై నిర్మాతల క్లారిటీ.. మొదలయ్యేది అప్పుడే..! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *