నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మొహమాటం లేకుండా బోల్డ్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఐతే, హైదరాబాద్‌లో బండ్ల గణేశ్ టాలీవుడ్ ప్రముఖుల కోసం దీపావళి వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, తేజ సజ్జా వంటి ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో, బండ్ల గణేష్.. తేజ సజ్జా గురించి కొన్ని సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.
ఇంతకీ, బండ్ల గణేశ్ ఏం మాట్లాడారు అంటే.. ‘భారతీయ చిత్ర పరిశ్రమలో తదుపరి అల్లు అర్జున్.. తేజ సజ్జా” అంటూ కామెంట్స్ చేశారు. బండ్ల గణేశ్ ఈ కామెంట్స్ చేయగానే.. ఈ వేడుకకు హాజరైన వారందరి నుండి హర్షధ్వానాలు, చప్పట్లు రావడం విశేషం. ఇక ఇటీవల బ్లాక్ బస్టర్ మిరాయ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజ సజ్జా, ఇప్పుడు ‘జాంబీ రెడ్డి 2’ కోసం మరోసారి దర్శకుడు ప్రశాంత్ వర్మతో జతకడుతున్నారు. ఇది వారి మూడవ ప్రాజెక్ట్. ఈ చిత్రం జనవరి 2027లో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రాండ్ విడుదల కానుంది. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
The publish ‘తేజ సజ్జా’ మరో అల్లు అర్జున్ అవుతాడు’ – బండ్ల గణేష్ first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.