Entertainment

‘కాంతార’ నాటౌట్.. 17వ రోజు సెన్సేషనల్ బుకింగ్స్!

కన్నడ నటుడు అలాగే దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా నటించి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కాంతార చాప్టర్ 1”. మంచి హైప్ నడుమ వచ్చి పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషనల్ హోల్డ్ ని ఈ చిత్రం అందుకోవడం విశేషం. ఇలా డే 1 నుంచే సంచలన బుకింగ్స్ తో మొదలైన కాంతార చాప్టర్ 1 ఇప్పుడు ఏకంగా 17 రోజులు వచ్చినా కూడా అదే భారీ బుకింగ్స్ ని కొనసాగిస్తుంది.

ఇలా డే 17కి 3 లక్షలకి పైగా టికెట్స్ ఈ చిత్రానికి అమ్ముడుపోయినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో కాంతార ఇప్పుడుకి కూడా నాటౌట్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక ఈ దీపావళి రేస్ లో కూడా మంచి వసూళ్లు ఈ చిత్రం రాబట్టే ఛాన్స్ గట్టిగా ఉందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా జైరాం, రుక్మిణి వసంత్ తదితరులు సాలిడ్ రోల్స్ లో నటించారు. అలాగే హోంబళే ఫిల్మ్స్ నిర్మాణం వహించారు.

The put up ‘కాంతార’ నాటౌట్.. 17వ రోజు సెన్సేషనల్ బుకింగ్స్! first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *