గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక పెద్ది చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఐతే, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తిండి కూడా మానేసి బుచ్చిబాబు ఫుల్ బిజీగా ఉంటున్నాడట. దీంతో, రామ్ చరణ్.. “ముందు ఆరోగ్యం ముఖ్యమని, తర్వాతే సినిమా” అంటూ బుచ్చిబాబుకి క్లాస్ పీకినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో తెలియదు గాని, చరణ్ చూపిన హ్యూమానిటీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
కాగా, ఇప్పటి వరకూ చరణ్ నుంచి వచ్చిన అన్ని చిత్రాల కంటే.. ఈ సినిమా చాలా భిన్నంగా ఉండబోతుందని టాక్. మొత్తానికి బుచ్చిబాబు రాసిన ఈ సినిమా స్క్రిప్ట్ చాలా భిన్నమైందట. అన్నట్టు ‘పెద్ది’ వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి పెద్ది సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.
The put up చరణ్ హ్యూమానిటీకి ఫ్యాన్స్ ఫిదా first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.