Entertainment

క్రిస్మస్ కానుకగా ‘పతంగ్’ మూవీ రిలీజ్

ప్రేక్షకులు ఇప్పటి వరకు ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు చూసినా, పతంగుల పోటీ నేపథ్యంలో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా ‘పతంగ్’ మాత్రం వినూత్నంగా నిలిచేలా కనిపిస్తోంది. సినిమాటిక్ ఎలిమెంట్స్ మరియు రిషన్ సినిమాస్ బ్యానర్లపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, దర్శకత్వం ప్రణీత్ ప్రత్తిపాటి వహించారు. ఇన్‌స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ప్రముఖ గాయకుడు, నటుడు ఎస్.పి. చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రేక్షకులకు ప్రత్యేకమైన థియేట్రికల్ అనుభూతి ఇవ్వాలనే లక్ష్యంతో, నిర్మాతలు అధిక నాణ్యత కలిగిన సీజీ వర్క్‌పై విస్తృతంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

తాజాగా విడుదల తేదీని ప్రకటించిన నిర్మాతలు మాట్లాడుతూ, “పతంగ్ సినిమా థియేటర్‌లో యూత్ ఫెస్టివల్‌లా ఉంటుంది. కొత్తవారితో చేసినా, పెద్ద సినిమా స్థాయిలో క్వాలిటీ ఉంటుంది. కథే ఈ చిత్రానికి హీరో. జోస్ జిమ్మి ఇచ్చిన పాటలు వినగానే పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి. సినిమా చూస్తున్నంతసేపు పతంగుల పోటీ ఉత్సాహంగా సాగుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. కొత్త కంటెంట్‌ను ప్రోత్సహించే తెలుగు ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని తప్పకుండా ఆదరిస్తారని విశ్వసిస్తున్నాం” అని తెలిపారు.

The put up క్రిస్మస్ కానుకగా ‘పతంగ్’ మూవీ రిలీజ్ first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *