Entertainment

పండగపూట కూడా ఆగని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ వర్క్

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. అయితే, దీపావళి పండుగ నాడు కూడా ఈ చిత్ర బీజీఎం వర్క్‌లో వారు బిజీగా ఉన్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇలా పండుగనాడు కూడా తమ టీమ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ను పక్కాగా తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండగా ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నవంబర్ 28న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

The submit పండగపూట కూడా ఆగని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ వర్క్ first seemed on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Scores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *