టాలీవుడ్‌లో స్టార్ హీరోలు ఒకరి రికార్డును మరొకరు బద్ధలుకొట్టడం కామన్. అయితే, సోషల్ మీడియాలో కూడా కొన్ని రికార్డులు స్టార్ హీరోల పేరిట ఉన్నాయి. అలాంటి వాటిలో ఎక్స్(గతంలో ట్విట్టర్)లో ఓ తెలుగు సినిమా ప్రమోషనల్ పోస్ట్ సాధించిన రికార్డును ఏ హీరో కూడా బీట్ చేయలేకపోయారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ట్విట్టర్‌లో మాసివ్ రికార్డు ఉంది. ఆ ప్రమోషనల్ పోస్ట్‌కు ట్విట్టర్ హ్యాండిల్‌లో ఏకంగా 285వేల లైకులు, 14 మిలియన్ ఇంప్రెషన్‌లు దక్కాయి. దీంతో ఇప్పటివరకు తెలుగులో అత్యధిక రీచ్ కలిగిన పోస్ట్‌గా ‘పుష్ప-2’ నిలిచింది.
ఇక ఇప్పుడు ఈ రికార్డును బద్దలుకొట్టే అవకాశం సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాత్రమే ఉందని సినీ సర్కిల్స్ టాక్. దర్శకుడు రాజమౌళితో మహేష్ చేస్తున్న మోస్ట్ హైప్ ఉన్న సినిమా నుంచి నవంబర్‌లో ఓ సాలిడ్ ట్రీట్ రానుంది. ఒకవేళ ఎవరి ఊహలకు అందని విధంగా రాజమౌళి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిజైన్ చేస్తే, ‘పుష్ప-2’ రికార్డును బద్దలుకొట్టడం ఖాయం. మరి ఈ విషయంలో బన్నీ రికార్డును మహేష్ బీట్ చేస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
The put up అల్లు అర్జున్ రికార్డును మహేష్ బద్దలు కొడతాడా..? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.