Entertainment

Sampradayini Suppini Suddapusani: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అంటున్న శివాజీ

వింటేజ్ బ్లాక్ బస్టర్ కపుల్, నటుడు శివాజీ మరియు లయ చాలా కాలం తర్వాత మళ్లీ జంటగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సుధీర్ శ్రీరామ్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ‘90’s’ వెబ్ సిరీస్ విజయం తర్వాత శివాజీ ఈ ప్రాజెక్టు ద్వారా మరోసారి ఈటీవీ విన్‌తో కలిసి పనిచేస్తుండటం విశేషం. తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను మోషన్ పోస్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే చాలా ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ‘90’s’ వెబ్ సిరీస్‌లో శివాజీ, బాల నటుడు రోహన్ మధ్య వచ్చే ఈ బీజీఎం అప్పట్లో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇప్పుడు అదే పేరును సినిమా టైటిల్‌గా పెట్టడం సినిమాపై అంచనాలను పెంచింది.

Additionally Learn : Nara Rohit : నాలుగు రోజల పాటు నారా వారి పెళ్లి వేడుకలు

ఈ చిత్రంలో శివాజీ పంచాయతీ సెక్రెటరీ శ్రీరామ్ పాత్రలో కనిపించనున్నారు. విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శివాజీ, లయ సీరియస్‌గా నడుస్తూ ముందుకు వస్తుండగా, ‘90’s’ ఫేమ్ రోహన్ సెల్ఫీ తీసుకుంటూ కనిపించడం క్యూరియాసిటీని పెంచుతోంది. మోషన్ పోస్టర్‌ను మేకర్స్ చాలా క్రియేటివ్‌గా ప్రజెంట్ చేశారు. చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ కథలో ఒక క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉన్నట్లు మోషన్ పోస్టర్ ద్వారా సూచించారు. ఇది సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ‘90’s’ సిరీస్‌లో శివాజీతో కలిసి నటించిన రోహన్‌తో పాటు అలీ, ధనరాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృధ్వీ, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రాజ్ తిరందాసు, కరణ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రంజిన్ రాజ్ సంగీతం అందిస్తుండగా, రిత్విక్ రెడ్డి కెమెరామెన్‌గా మరియు బాలు మనోజ్.డి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *