టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘మాస్ జాతర’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు భాను బోగవరపు డైరెక్ట్ చేస్తున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాతో మాస్ రాజా రవితేజ బాక్సాఫీస్ దగ్గర మాస్ హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
తాజాగా ఈ సినిమా నుంచి ‘సూపర్ డూపర్’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట పూర్తి మాస్ నెంబర్‌గా అదిరిపోయే ట్యూన్స్, డ్యాన్స్ స్టెప్పులతో ఇరగదీసింది. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం.. రవితేజ, శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్పులు కలగలిసి ఈ పాటను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.
అక్టోబర్ 31న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ సినిమాలో ఈ ‘సూపర్ డూపర్’ సాంగ్ ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకుంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
The publish మాస్ నెంబర్‌గా ‘సూపర్ డూపర్’ సాంగ్.. ఇక మాస్ జాతరే..! first gave the impression on Newest Telugu Film Information, Critiques, OTT, OTT Critiques, Rankings.