Entertainment

అందరి చూపులు ప్రభాస్-హను అప్డేట్‌పైనే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు అభిమానులు, సినిమా సెలెబ్రిటీలు, శ్రేయోభిలాషుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రభాస్ బర్త్ డే కానుకగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వరుస అప్డేట్స్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఈ క్రమంలో దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ చిత్రం నుంచి రాబోతున్న సాలిడ్ అప్డేట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర టైటిల్‌పై పలు వార్తలు వినిపించగా, ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

మరి ఈ సినిమాకు ఎలాంటి టైటిల్‌ను పెడతారా.. ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో ప్రభాస్ ఎలా కనిపిస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరికొద్ది గంటల్లో ఈ సినిమా నుంచి రాబోతున్న అప్డేట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

The put up అందరి చూపులు ప్రభాస్-హను అప్డేట్‌పైనే..! first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *