Entertainment

2026లో నాలుగు పై కన్నేసిన శర్వానంద్..?

హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన గత చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయం అందుకోలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని శర్వా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’, ‘బైకర్’ చిత్రాలను ముందుగా పూర్తి చేయాలని శర్వా భావిస్తున్నాడు.

ఇక ఈ రెండు సినిమాలను 2026లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ కూడా రెడీ అవుతున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు సంపత్ నంది డైరెక్షన్‌లో ‘భోగి’ అనే సినిమాను కూడా వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు శర్వా. అయితే, ఈ మూడు సినిమాల తర్వాత మరో డైరెక్టర్ శ్రీను వైట్లతో ఓ సినిమా చేయాలని శర్వా నిర్ణయించుకున్నాడట.

అన్నీ అనుకున్నట్లు కుదిరితే, శ్రీను వైట్ల చిత్రాన్ని కూడా 2026లోనే రిలీజ్ చేయాలని ఈ హీరో ప్లాన్ చేస్తున్నాడట. మొత్తానికి 2026లో శర్వానంద్ నాలుగు సినిమాలను రిలీజ్ చేయాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. మరి ఇందులో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయి అనేది వేచి చూడాలి.

The submit 2026లో నాలుగు పై కన్నేసిన శర్వానంద్..? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *