Entertainment

‘ఫౌజీ’ చిత్రంలో కన్నడ బ్యూటీ.. ఎవరంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న హను రాఘవపూడి దర్శకత్వంలోని సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి “ఫౌజీ” అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. టైటిల్‌తో పాటు విడుదల చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక అభిమానులు మరిన్ని అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, కన్నడ నటి చైత్ర జె.ఆచార్ ఈ పీరియాడిక్ యాక్షన్ రొమాంటిక్ డ్రామాలో భాగమని తెలుస్తోంది. ఆమె గతంలో 3BHK చిత్రంలో నటించింది. ‘ఫౌజీ ఒక అద్భుతమైన సృష్టి’ అంటూ ఆమె హను రాఘవపూడి పనిని ప్రశంసించడంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు.

The publish ‘ఫౌజీ’ చిత్రంలో కన్నడ బ్యూటీ.. ఎవరంటే? first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *